ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. మహిళ మృతి

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. మహిళ మృతి

HYD: కేపీహెచ్‌బీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీలోని 9వ ఫేజ్‌లో చెత్త సేకరించే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈక్రమంలో ఓ వివాహిత మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.