కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీతారాములు
BDK: భద్రాచల రామయ్య మరి కొద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గురువు విశ్వామిత్రుడితో మిథిలాకు వెళ్లిన రామయ్య శివధనసు విరిచి సీతమ్మను దక్కించుకున్నాడు. సీతమ్మ సిగ్గులొలుకుతూ రామయ్య మెడలో వర మలా వేసింది. అనంతరం రామయ్య సీతమ్మ చేయి పట్టి, పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని సిగ్గుతో తలవంచిన సీత మెడలో రామయ్య తాళి కట్టి ఇద్దరు ఒక్కటి కానున్నారు.