రేపు ఉచిత మెగా వైద్య శిబిరం
CTR: పెద్దపంజాణి మండలంలోని మాదనపల్లె పంచాయతీ కత్తార్లపల్లె గ్రామంలో బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు భానుప్రతాప్ రెడ్డి, కృష్ణప్ప, ఎల్లప్ప తెలిపారు. తిరుపతి రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు అన్నిరకాల వైద్యసేవలు అందిస్తారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.