'భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం'
AKP: భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి పునరావాస కేంద్రంలో బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిపి నిత్యవసర సరుకులను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.