వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్ పర్సన్
MBNR: మిడ్జిల్ మండలంలోని బోయిన్ పల్లి, వాడ్యాల, మిడ్జిల్, గ్రామాలలో మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ జ్యోతి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ... రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.