VIDEO: ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మసీదులో శుక్రవారం రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఇఫ్తార్ విందును ఆరగించారు. సర్పంచ్ లక్ష్మీరాజం మాట్లాడుతూ.. ప్రతి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం, గంగా హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.