అవినీతి ఆరోపణలపై ఈవో విచారణ
NDL: అవుకు శివాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి వచ్చిన వార్తా కథనాలకు స్పందించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాల చెంచన్న సమగ్ర విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధి, పారదర్శక పాలన కోసం త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. బ్యాంకులో శివాలయం పేరుతో ప్రత్యేక ఖాతా తెరవాలన్నారు.