డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: పలాస మున్సిపాలిటీలో ఉన్న సాయి కాలనీలో గురువారం డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పలాస డివిజన్ పరిధిలోని 8 మండలాల సచివాలయ పరిపాలన వ్యవస్థను ఈ కార్యాలయం నుంచి అనుసంధానంతో నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్ పాల్గొన్నారు.