భారత్‌, చైనా మధ్య ఎయిరిండియా విమాన సర్వీసులు

భారత్‌, చైనా మధ్య ఎయిరిండియా విమాన సర్వీసులు

భారత్-చైనా మధ్య సర్వీసులను ఎయిరిండియా ప్రారంభించనుంది. 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ-షాంఘై, ముంబై-షాంఘై సర్వీసును ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఎయిరిండియా సీఈఓ విల్సన్ తెలిపారు. దీని వల్ల ప్రయాణికులు వాణిజ్య, వైద్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. కాగా వారానికి 4 సర్వీసులు ఉండే అవకాశం ఉంది.