వీధికుక్కల దాడి.. స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

వీధికుక్కల దాడి.. స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

RR: హయత్‌నగర్‌లోని శివగంగకాలనీలో నివసిస్తున్న ఎనిమిదేళ్ల మూగ బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ దాడిలో బాలుడి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి, కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కేసును నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను కమిషన్ కోరే అవకాశం ఉంది.