VIDEO: పండుగలా ఇరుముడి కార్యక్రమం
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని వీర హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజున హనుమాన్ దీక్షా స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కళ్యాణ రామాలయంలో ఇరుముడి కట్టిన అనంతరం, స్వాములు భజనలు చేస్తూ ఊరేగింపుగా హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు.