మేడ్చల్ జిల్లాలో HOT SPOT ప్రాంతాలు ఇవే..!
MDCL: మేడ్చల్ జిల్లాలో గత 4 రోజులుగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించింది. మూసాపేట మోతీ నగర్, కీసర, మల్కారం, దమ్మాయిగూడ, దూలపల్లి, గాజులరామారం, బాలాజీ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాలుగా ప్రకటించింది.