పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

NRPT: కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులలో సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు.