జగన్మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ భేటీ

VSP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ బుధవారం భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసిన అదిప్.. జిల్లా, నియోజకవర్గ రాజకీయ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసే వారిపై డిసిప్లినరీ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.