సాయుధ బలగాల సెలవులు రద్దు: అమిత్ షా

సాయుధ బలగాల సెలవులు రద్దు: అమిత్ షా

సాయుధ బలగాల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. CRPF, BSF, ITBP సహా అన్ని పారామిలిటరీ బలగాల అధిపతులకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తక్షణమే తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.