నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

JGL: సారంగాపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గడ్డం శ్రీనివాస్ తన నిజాయితీని చాటుకున్నాడు. రేచపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన ద్విచక్రవాహనంపై జగిత్యాల వైపు వస్తుండగా పొలాస గ్రామ స్టేజీ సమీపంలో తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ వారిని పిలిచినా వినకపోవడంతో జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్‌కు ఫోన్ అందజేశాడు.