'ఆపరేషన్ సింధూర్'కు క్రీడా వర్గాల మద్దతు

భారత ఆర్మీ పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. దీనిపై క్రీడా వర్గాల నుంచి పలువురు మద్దతు ప్రకటించారు. సెహ్వాగ్ 'ధర్మో రక్షతి రక్షితః.. జైహింద్ భారత సేన' అని పేర్కొన్నాడు. వరుణ్ చక్రవర్తి, సురేశ్ రైనా 'ఆపరేషన్ సింధూర్' అని పోస్ట్ చేశారు. గంభీర్ 'జై హింద్' అన్నారు. అలాగే, ఇంగ్లండ్ క్రికెటర్ బిల్లింగ్స్ IND, PAK మధ్య పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆకాంక్షించారు.