VIDEO: యాదవ నగర్‌లో పేకాటపై దాడి.. 11 మంది అరెస్టు
HNK: హన్మకొండ నగరంలోని యాదవ నగర్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 59,340 నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.