జననాల రేటును పెంచేందుకు.. వాటిపై చైనా ట్యాక్స్‌

జననాల రేటును పెంచేందుకు.. వాటిపై చైనా ట్యాక్స్‌

చైనాలో కొంతకాలంగా జననాల రేటు తగ్గుతూ వస్తుంది. యువత పిల్లలను కనేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం దక్కటం లేదు. ఈ తరుణంలో జిన్‌పింగ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భనిరోధక సాధనాలపై పన్ను విధించేందుకు సిద్ధమైంది. తద్వారా జననాల రేటు పెరుగుతుందని భావిస్తోంది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం 3దశాబ్దాల్లో ఇదే తొలిసారి కావటం గమనార్హం.