దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు లేవు: కిషన్ రెడ్డి
TG: దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు అసలే లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని భారత ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల పాటు ప్రజలు భయపడి అవసరానికి మించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకున్నారని.. ఫలితంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని కేంద్ర మంత్రి చెప్పారు.