చెనిగుంటలో రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి

చెనిగుంటలో రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి

TPT: తడ మండలం చెనిగుంట గ్రామంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం 4వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ రైతులతో నేరుగా సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాల వివరాలను రైతులకు వివరించారు. రైతుబంధు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలపై అవగాహన కల్పించారు. సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.