'జనగామ'కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

'జనగామ'కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

జనగామ జిల్లా పేరుకు చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వంలో ఈ ప్రాంతాన్ని “జైన్ గావ్”గా పిలిచేవారు, అంటే జైనుల గ్రామం అని అర్థం. జైనమత ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతం జైనులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉండేది. కాలక్రమేణా ఉచ్చారణ మార్పుతో “జైన్ గావ్” నుంచి “జనగామ”గా మారింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ జైన సంప్రదాయాల ఆనవాళ్లు కనిపిస్తాయి.