VIDEO: ఇంటింటికి డస్ట్ బిన్స్ పంపిణీ
కృష్ణా: గుడ్లవల్లేరులో పంచాయతీ అధికారులు ఇంటింటికీ డస్ట్ బిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. వేరు వేరు బిన్ల ద్వారా తడి, పొడి చెత్తలను వేరుగా సేకరించవచ్చని తెలిపారు. దీనివల్ల గ్రామం శుభ్రంగా ఉండటమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ సులభమవుతుందని అన్నారు.