ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు
NRML: భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ రఘునాథ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పట్టుదలతో చదివి ప్రపంచ స్థాయికి ఎదిగి దేశానికి గౌరవం తెచ్చిన మహానుభావుడని తెలిపారు. కార్యక్రమంలో డా. రవికుమార్, డా. జై భీమ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.