'నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదు'

'నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదు'

ప్రకాశం: నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. మంగళవారం రాత్రి మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు.