'నిబంధనలను ఉపసంహరించుకోవాలి'
AKP: జీవీఎంసీ పరిధిలో పార్కులు, స్టేడియాల్లో నడకకు ఫీజు విధించే నిర్ణయంపై వైసీపీ నాయకులు జోనల్ సూపరింటెండెంట్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అన్నారు. ప్రజలపై భారంగా మారే ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.