రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: గూడూరు పట్టణంలో గమ్మళపాలెం ప్రాంతం నందు ఉన్న గూడూరు ఎమ్మెల్యే కార్యాలయం నందు బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో గూడూరు పట్టణం ప్రజలు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనిరావచ్చని తెలిపారు.