గ్యాస్ దందా.. సర్కార్ అలర్ట్
పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గత నెల 12 నుంచి ఈనెల 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,699 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి గ్యాస్ కనెక్షన్లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.