H-1B వీసాలో కొత్త రూల్స్
టెక్ కంపెనీల్లో విదేశీయులను తగ్గించి అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ మేరకు H-1B వీసాదారుల వేతనాలను పెంచేలా ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగుల వేతనం పెరిగే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం భారీ వ్యత్యాసం ఉంటోందని, దీంతో చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని ఆందోళనలు ఉన్నాయి.