గుత్తి కోటను సందర్శించిన గంజిమల దేవి
ATP: గుత్తి కోటను ఏపీ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి శుక్రవారం సందర్శించారు. ముందుగా గుత్తి కోట వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి ఆమెను స్వాగతం పలికారు. అనంతరం కోటలోని నిర్మాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుత్తి కోట అద్భుతంగా ఉందని తెలిపారు. కోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.