VIDEO: 'కౌంటింగ్ సందర్భంగా సభలు, ర్యాలీలు నిషేధం'
WGL: వర్ధన్నపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా నేడు ఏసీపీ నర్సయ్య స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ నియంత్రణలతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు,ఉత్సవాలు నిషేధం విధించబడినట్టు స్పష్టం చేశారు.