సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ కేంద్రంలోని ఉప్పరవాడ ప్రాంతంలో రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సవిత శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనగా, మంత్రి స్థానిక అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.