VIDEO: ప్రకృతి మధ్యలో శివయ్య

VIDEO: ప్రకృతి మధ్యలో శివయ్య

VZM: శృంగవరపుకోట సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 'పుణ్యగిరి' కొండ ప్రకృతి రమణీయమైన పర్యాటక ప్రాంతం. దీనిని 'దక్షిణ కాశీ'గా పిలుస్తారు. ఇక్కడ శివలింగం స్వయంభూవుగా వెలసిందని భక్తుల నమ్మకం. కొండపై నుంచి నిరంతరం ప్రవహించే ఒక చిన్న జలపాతం నేరుగా శివలింగంపై పడుతూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ కొండపై మూడు ప్రధాన శివలింగాలు ఉండటంతో దీనిని త్రికోటేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు.