చెత్త డబ్బా ఢీకొని వాహనదారుడికి తీవ్ర గాయాలు
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి సిపాన చంద్రయ్యపేట వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న చెత్త డబ్బా కారణంగా ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం దీన్ని ఢీకొన్న ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.