ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ పట్టణంలోని తాతమ్మ గుడి, విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బావాపూర్ గ్రామంలో బీరప్ప, కమరతి దేవతల మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీరప్ప ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.