దీపావళి దుకాణాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ నరసింహ
SRPT: దీపావళి సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపవద్దని స్పష్టం చేశారు.