ఆదిలాబాద్ జిల్లాలోనే నార్నూర్ టాప్
ఆదిలాబాద్ జిల్లాలోనే నార్నూర్ మండలం ముందంజలో ఉంది. ఇటీవల కేంద్రం ద్వారా ఆస్పిరేషనల్ బ్లాక్ కింద నార్నూర్ ఎంపికవడంతో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశాన్ని సందర్శించిన కేంద్ర పర్యవేక్షణ అధికారి ప్రీతీ మీనన్ నార్నూర్ మహిళలు తయారు చేసిన వెదురు సామాగ్రిని పరిశీలించి అభినందించారు.