గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే

ప్రకాశం: దోర్నాల మండలం పడమటి బొమ్మలాపురం గ్రామంలో బ్రహ్మంగారి గుడి గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గిరిజనులు నివసించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా గిరిజనులకు గృహాలు, నీటి వసతిని పరిష్కరించాలన్నారు.