గీతానగర్‌లో రోడ్డు పనులు పరిశీలన

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్ కాలనీలో మంత్రి సవిత నూతన సీసీ రోడ్డు వేయించారు. శనివారం రోడ్డు పనులను హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ పర్యవేక్షించారు. రోడ్డు పనులు పూర్తి చేయించారు. దీంతో గీతానగర్ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు వేయించి సమస్య పరిష్కరించినందుకు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు.