బస్సు ఢీకొని వ్యక్తి మృతి

HNK: హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపు వద్ద ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట దర్గాకు చెందిన యాకూబ్ పాషా వ్యక్తిగత పని నిమిత్తం వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది