ధర్వేశిపురంలో పోటెత్తిన భక్తులు!

ధర్వేశిపురంలో పోటెత్తిన భక్తులు!

NLG: కనగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునే అమ్మవారికి నిజాభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించారు.