కొత్తగా 15 పోషకాహార పునరావాస కేంద్రాలు

కొత్తగా 15 పోషకాహార పునరావాస కేంద్రాలు

AP: ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాల్లో 11 గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 340 పడకలతో 21 ఎన్‌ఆర్‌సీలు ఉన్నాయని తెలిపారు.