పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం
MNCL: చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాలలో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం. హరి తెలిపారు. నడిచే సామర్థ్యం కలిగిన 6 వాహనాలు, స్క్రాప్ రూపంలో 10 వాహనాలకు వేలం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు బహిరంగ వేలంలో పాల్గొనాలని సూచించారు.