రూ.650 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో నగదు, డ్రగ్స్, మద్యం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమబెంగాల్‌లో రూ.319 కోట్లు, తమిళనాడులో రూ.170 కోట్ల విలువైన సొత్తును ఈసీ స్వాధీనం చేసుకుంది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో 5,173 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది.