VIDEO: నర్సింగాపూర్లో త్రాగునీటి సమస్య తీవ్రం..!
MLG: తాడ్వాయి మండలం నర్సింగాపూర్ గ్రామంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రమైంది. ఉన్న బోర్ మోటార్ కాలిపోవడం, కొత్తగా వేసిన బోర్ విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ నీరు అపరిశుభ్రంగా, మురికిగా ఉండటంతో తాగలేకపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.