శబరిమలలో దర్శనానికి పోటెత్తిన భక్తులు

శబరిమలలో దర్శనానికి పోటెత్తిన భక్తులు

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకోవడంతో ఇవాళ ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం అత్యవసర వైద్య సేవల కేంద్రాలను ఏర్పాటు చేశారు.