PM కిసాన్ మెగా చెక్కు రైతులకు పంపిణీ

PM కిసాన్ మెగా చెక్కు రైతులకు  పంపిణీ

CTR: పుంగనూరు మండల కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' రెండవ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి AMC ఛైర్మన్ సేమిపతి యాదవ్, సింగిల్ విండో ఛైర్మన్ పగడాల రమణ, TDP మండల అధ్యక్షులు మాధవరెడ్డి హాజరయ్యారు. రైతులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 37,191 మంది రైతులకు రూ. 24.92 కోట్లు మంజూరైనట్లు వారు తెలిపారు.