వ్యవసాయ పనిముట్లకి దరఖాస్తులుగా ఆహ్వానం

SRCL: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ముస్తాబాద్ మండల వ్యవసాయాధికారి దుర్గరాజు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, సన్న, చిన్నకారు రైతులకు 40 శాతం రాయితీపై పనిముట్లు అందజేస్తామన్నారు. ఈనెల 23 లోగా దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.