మేడిపల్లి జెండా పూజా కార్యక్రమానికి MLAకు ఆహ్వానం
ASF: సిర్పూర్ (టి) మండలం మేడిపల్లిలో ఏప్రిల్ 13న నిర్వహించనున్న గోండే రాజా సుర్యం ముకాసిల స్మారక జెండా పూజా కార్యక్రమానికి MLA కోవ లక్ష్మీని నిర్వాహకులు సోమవారం ఆహ్వానించారు. చైత్ర శుద్ధ ద్వాదశి సందర్భంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా MLA హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు కోరారు.