భారీ స్ట్రైక్‌రేట్ ఉన్నా అతడికి చోటు ఇవ్వలేదు: అశ్విన్

ఆసియా కప్ కోసం భారత్ స్క్వాడ్‌లో జైస్వాల్‌కు చోటు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత టీ20 ప్రపంచకప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న యశస్వికి ఆసియా కప్‌లో చోటు కల్పించకపోవడం సరికాదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుందని గుర్తుచేశాడు. ఒక దశలో కెప్టెన్ రేసులో నిలిచిన ఆటగాడు.. ఏకంగా జట్టులోనే లేకపోవడం షాక్‌కు గురిచేసిందన్నాడు.